ఇటీవల ‘సీత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడంతో ప్లాప్ గా మిగిలింది. ఇదిలా పక్కన పెడితే.. తన గురువు రాంగోపాల్ వర్మ లానే ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటాడు తేజ. కొంతమందికి ఈయన మాట తీరు నచ్చినా మరికొందరికి కాస్త విడ్డూరంగా ఉంటుందని కామెంట్స్ చేస్తుంటారు. సంఘటన ఏదైనా… సందర్భం ఏదైనా తనదైనా స్టైల్ లో స్పందిస్తుంటాడు. ఇప్పుడు కూడా తేజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు మరణం గురించి కొన్ని విచారకరమైన సంగతుల్ని తెలిపాడు. తేజ మాట్లాడుతూ.. “నా కొడుక్కి నాలుగేళ్ళ వయసులో అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్ లో చేర్పించాము. ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్స్ చేసిన మిస్టేక్ కారణంగా నా కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమించింది. నా కొడుకుని కాపాడుకోవడం కోసం జర్మనీ, చైనా దేశాలు తీసుకెళ్ళాము. అయినా బ్రతికించుకోలేకపోయాము.
నా కొడుకు కోసం ఇంటినే హాస్పిటల్ గా మార్చేశాం, నాలుగేళ్ళ పాటు సరిగ్గా నిద్రపోలేదు కూడా…! 24 గంటల పాటు మూడు షిఫ్ట్ లలో ఇద్దరు నర్సులు ఉండేవారు, ఒక డ్రైవర్ కూడా ఉండేవాడు. ఆక్సిజన్ మిషన్, జనరేటర్, క్లీనింగ్ మిషన్ వీటన్నింటితో ఇల్లు హాస్పిటల్ గా ఉండేది. ఆ రోజుల్లో రాత్రి, పగలూ చాలా కష్టపడ్డాము. నాలుగేళ్ళు సినిమాలు కూడా చేయలేదు. వెంటనే ఆ హాస్పిటల్ పై కేసు వెయ్యి అంటూ చాలా మంది నాకు చెప్పారు. కేసు వేస్తా.. కానీ డబ్బుల కోసం కాదు.. నా కొడుకు బతికివస్తాడంటే కచ్చితంగా కేసు వేస్తాను.. అంటూ వారికి బదులిచ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు తేజ.