‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).ఆ సినిమా ప్లాప్ అయినా ఆమె లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో రవితేజ(Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) సినిమాలో ఆమెకు ఛాన్స్ లభించింది. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. తర్వాత అడివి శేష్ (Adivi Sesh) తో చేసిన ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT: The Second Case) ఆమెకు తొలి హిట్ అందించిన సినిమా. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి.
అందులో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమె మహేష్ బాబుకి (Mahesh Babu) మరదలి పాత్ర చేసింది. వాస్తవానికి ఈ పాత్ర మొదట శ్రీలీలతో (Sreeleela) చేయించాలి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కథలో మార్పులు చోటు చేసుకోవడంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. అయితే ‘గుంటూరు కారం’ లో మీనాక్షి చౌదరి చేసిన రాజి పాత్ర ప్రేక్షకులకి రుచించలేదు. ‘హీరోయిన్ కి తక్కువ పనిమనిషికి ఎక్కువ’ అంటూ ‘గుంటూరు కారం’ రిలీజ్ టైంలో ఆమెపై విమర్శలు కురిశాయి.
నిజానికి మీనాక్షిని తీసుకున్నప్పుడు మహేష్ తో ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారట. తర్వాత ఆ సాంగ్ చిత్రీకరించలేదు. అందుకోసం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాలో మీనాక్షి రోల్ కి కొన్ని సీన్స్ పెంచి ఆమె హైలెట్ అయ్యేలా చేయమని దర్శకుడు వెంకీ అట్లూరికి (Venky Atluri) త్రివిక్రమ్ (Trivikram) చెప్పారట. సినిమాలో ఆమె పాత్రకి మంచి డైలాగులే రాశారు. అలా ‘గుంటూరు కారం’ తో మీనాక్షికి జరిగిన డ్యామేజ్ ని ‘లక్కీ భాస్కర్’ తో రీప్లేస్ చేశారట త్రివిక్రమ్ (Trivikram) .