Rukmini Vasanth: పాపం రుక్మిణి వసంత్.. ఇప్పుడు పెద్ద ఛాన్సులు వస్తాయా?

గతేడాది ఓ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయ్యింది ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ (Sapta Sagaralu Dhaati). ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాలతో తెలుగు నాట బాగా పాపులర్ అయ్యింది రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) . ఈమె లుక్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఎక్స్ప్రెషన్స్ కూడా..! అందుకే ఈమెను తెలుగు సినిమాల్లోకి తీసుకోమని సోషల్ మీడియాలో చాలా నెటిజన్లు విజ్ఞప్తి చేశారు.

Rukmini Vasanth

ఆ వెంటనే ఈమెకి తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan) సినిమాలో ఛాన్స్ వచ్చింది. వాస్తవానికి ఆమె టాలీవుడ్ డెబ్యూ రెండేళ్ల క్రితమే ఇవ్వాలి. అయితే ఆ సినిమా షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) సినిమా. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలి. కానీ కుదర్లేదు. అయితే హడావిడిగా కంప్లీట్ చేసి ఈ సినిమాను విడుదల చేశారు. నిన్న విడుదలైన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో రుక్మిణి వసంత్ కి దెబ్బ పడినట్టు అయ్యింది. గత వారం వచ్చిన ‘భగీర’ కూడా నిరాశపరిచింది. అందులో కూడా ఈమె పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటే బాగుణ్ణు అని ఈమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘ఏకంగా ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాల్లో ఈమెకు ఛాన్స్ వస్తుంది.. ఈమె కెరీర్ సెట్ అయిపోయినట్టే’ అని అంతా అనుకుంటున్న టైంలో ఈ సినిమాలు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడం పెద్ద దెబ్బె అని చెప్పాలి.

ఆ దేశంలో బలగం.. క్లిక్కయ్యేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus