టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరనే సంగతి తెలిసిందే. మున్నా సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన వంశీ పైడిపల్లి బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. మహర్షి సినిమా విడుదలై రెండు సంవత్సరాలైనప్పటికీ వంశీ పైడిపల్లి కొత్త సినిమా మొదలు కాలేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా త్వరలో ఒక సినిమా తెరకెక్కనుండగా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన రానుంది.
అయితే సినిమాసినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువగా రావడం గురించి వంశీ పైడిపల్లి స్పందిస్తూ తాను సొంతంగా కథలు తయారు చేసుకోలేనని అందువల్ల కథల కోసం రైటర్లపై ఆధారపడుతున్నానని అన్నారు. ఈ రీజన్ వల్లే తన డైరెక్షన్ లో సినిమాలు వేగంగా రావడం లేదని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. ఒక సినిమా పూర్తైన తరువాత కథ కోసం వెతకడం మొదలుపెడితే మరో సినిమా షూటింగ్ మొదలు కావడానికి సమయం పడుతోందని వంశీ పైడిపల్లి తెలిపారు.
అయితే ఇకపై మాత్రం సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా రాదని విజయ్ తో తెరకెక్కిస్తున్న సినిమా తరువాత సినిమాలకు సైతం కథలు సిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నానని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. వంశీ పైడిపల్లి విజయ్ తో తెరకెక్కించనున్న సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుండటం గమనార్హం. స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ పై పట్టు ఉన్న వంశీ పైడిపల్లి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. టాలీవుడ్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన వంశీ పైడిపల్లి విజయ్ కు ఎలాంటి హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!