‘ఊపిరి’ సినిమా తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమా చేయడానికి మూడేళ్ల సమయం తీసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి ఇంకో మూడేళ్లు పట్టేలా ఉంది. దర్శకుడిగా ఆయన సినిమా సినిమాకి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటాడనే విషయంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తను ముందు డైరెక్టర్ అని.. ఆ తరువాతే రచయితని అని చెప్పారు. తనకు ఏదైనా ఐడియా వస్తే అంత ఈజీగా డెవలప్ చేయలేనని.. రచయితలతో కూర్చోవాలని అన్నారు.
తన ఆలోచన వాళ్లకు చెబుతానని.. వాళ్లు ఇంకేదో చెప్తారని.. ఇలా చాలా టైమ్ తీసుకుంటానని అన్నారు. వెంటవెంటనే పని చేయలేనని అన్నారు. వందల మార్పులు జరుగుతాయని.. మనసుకి నచ్చేవరకు ఈ ప్రాసెస్ జరుగుతుందని అన్నారు. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటానని.. అందుకే టైమ్ తీసుకుంటానని అన్నారు. పూరి జగన్నాథ్ రెండు వారాల్లో ఓ కథ రాసేస్తారని.. ఆయనకు రెండు చేతులెత్తి దండం పెడతానని.. తను మాత్రం అలా రాయలేనని చెప్పుకొచ్చింది.
‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకు తనకు సోలమన్ మంచి ఇన్ పుట్స్ ఇచ్చారని చెప్పుకొచ్చిన వంశీ పైడిపల్లి.. ఇప్పుడు విజయ్ సినిమా కోసం కూడా కొంతమంది రచయితలతో వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!