Vasishta: ‘బింబిసార2’పై క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!

ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ‘బింబిసార’ సినిమా. ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది. చారిత్రక నేపథ్యంలో కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దుర్మార్గుడైన రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. సినిమాపై పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలను తీసుకొచ్చారు దర్శకుడు. రిలీజ్ కు ముందు ‘బింబిసార’ సినిమాను మూడు భాగాలుగా తీసే అవకాశం ఉందని కళ్యాణ్ రామ్ చెప్పినప్పుడు..

చాలా మంది విమర్శించారు. ఇప్పుడు వారంతా సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార2’ కోసం ఆల్రెడీ సన్నాహాలు మొదలైన మాట నిజమే కానీ ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేలా లేదు. ఈ విషయంపై దర్శకుడు వశిష్ట్ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కళ్యాణ్ రామ్ కి ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయని.. అవన్నీ పూర్తయిన తరువాత ‘బింబిసార2’ మొదలవుతుందని అన్నారు.

ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడానికి తమ టీమ్ చాలా కష్టపడాల్సి ఉంటుందని దర్శకుడు తెలిపారు. ‘బింబిసార సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని.. ప్రస్తుతం వారంతా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారని.. వారందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నానని దర్శకుడు వశిష్ట్ అన్నారు.

వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించాలనుకుంటున్నామని.. మొదటి భాగాన్ని మించి రెండో పార్ట్ ను తీయాలనే ఒత్తిడి తనపై ఉన్నట్లు చెప్పారు. కళ్యాణ్ రామ్ తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసిన తరువాత ‘బింబిసార2’ షూటింగ్ ను మొదలుపెడతారని అన్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus