Gudumba Shankar: ‘గుడుంబా శంకర్’ ప్లాప్ కాదు.. కానీ ఫ్యాన్స్ కు నచ్చలేదు అంతే : వీర శంకర్

పవన్ కళ్యాణ్ తో అతని సోదరుడు నాగబాబు నిర్మించిన ‘గుడుంబా శంకర్’ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది అని అంతా అంటుంటారు. 2004 సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్లో ఓ ప్లాప్ మూవీగానే లెక్కేస్తుంటారు. వీర శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో కామెడీ సూపర్ గా ఉంటుంది అని చెప్పే వారి సంఖ్య ఎక్కువే. అలాగే మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.

అయినప్పటికీ ఈ సినిమాకి మొదటి రోజు ప్లాప్ టాక్ వచ్చింది అనేది నిజం. కానీ ఈ చిత్రం దర్శకుడు వీరశంకర్.. ‘గుడుంబా శంకర్’ ప్లాప్ సినిమా కాదు అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. “కంపేరిజన్ గా చూసుకుంటే.. ‘జానీ’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ‘గుడుంబా శంకర్’ సినిమా కూడా ఫ్యాన్స్ కు నచ్చలేదు. వాళ్ళు ‘గుడుంబా శంకర్’ అనే టైటిల్ చూసి.. ఇది మాస్ మసాలా సినిమా అనుకుని భారీ అంచనాలతో థియేటర్ కు వచ్చారు.

కానీ మేమేమో కామెడీ టచ్ ఇచ్చాము. క్లైమాక్స్ విషయంలో కూడా డిజప్పాయింట్ అయ్యారు. కానీ సెకండ్ వీక్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు ఆ మూవీ. ఫస్ట్ వీక్ లో ఉన్న టాక్.. సెకండ్ వీక్ లో లేదు. నిలబడి బ్రేక్ ఈవెన్ అయ్యింది ఈ ప్రాజెక్టు. కాకపోతే అభిమానులకు కూడా నచ్చి ఉంటే ‘ఖుషి’ రేంజ్ సినిమా అయ్యేది. అదొక్కటే.. మైనస్ తప్ప, నాకు తెలిసి ‘గుడుంబా శంకర్’ సినిమా ఆ రోజుల్లోనే రూ.16 కోట్లు షేర్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

త్వరలో ‘గుడుంబా శంకర్’ (Gudumba Shankar) చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని నాగబాబు భావిస్తున్నారు. తద్వారా వచ్చిన అమౌంట్ ను ‘జనసేన’ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆరెంజ్’ విషయంలో కూడా ఇదే చేశారు నాగబాబు. అది బాగా వర్కౌట్ అయ్యింది.’గుడుంబా శంకర్’ విషయంలో కూడా అదే చేయబోతున్నారు. కాకపోతే ఈ రీ రిలీజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించడానికి నాగబాబు రెడీ అయినట్టు టాక్ వినిపిస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus