‘కస్టడీ’.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్ద బజ్ లేకుండా ఓపెన్ అయి, త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మంచి బజ్‌తో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ట్విటర్ పేజీ రాసిన మాటలకు డైరక్టర్ వెంకట్ ప్రభు హర్ట్ అయ్యారు. ఒకింత అసహనంతో నమస్కారం అంటూ విమర్శలు కూడా చేశారు. దానికి కారణం సినిమాను డబ్బింగ్ చిత్రం అని అనడమే. ఇంతకీ ఏమైందంటే…
నాగచైతన్య, కృతి శెట్టి జోడీగా (Venkat Prabhu) వెంకట్ ప్రభు ‘కస్టడీ’ అనే సినిమా తెరకెక్కించారు. ఏ వెంకట్ ప్రభు ఛేజ్ అనేది సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంపై ఓ ట్విటర్ ఖాతాలో పెట్టిన పోల్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు అసహనం వ్యక్తం చేశారు. దయచేసి ‘కస్టడీ’ని డబ్బింగ్ సినిమాలా చూడొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మే 12న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
కోలీవుడ్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విటర్‌లో తాజాగా పోల్ నిర్వహించింది. ఈ వారం తమిళంలో విడుదల కానున్న ఏ సినిమాలను మీరు చూడాలని అనుకుంటున్నారు? అని పోల్ పెట్టాడు. దానికి గుడ్ నైట్, ఫర్హానా, కస్టడీ (డబ్బింగ్ సినిమా), 4. రావణ కొట్టం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ పోల్ అటు తిరిగి, ఇటు తిరిగి వెంకట్ ప్రభు కంట పడింది. అయితే ఆ పోల్‌లో కస్టడీ పేరు పక్కన ఉన్న డబ్బింగ్ సినిమా అని చూసి ఆయన అసహనానికి గురయ్యారు.
మై ఫ్రెండ్.. ‘కస్టడీ’ సినిమా డబ్బింగ్ కాదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన సినిమా ఇది అని రాసుకొచ్చారు. అంతవరకు ఓకే కానీ.. ఆఖరులో నమస్కారం పెడుతున్న ఎమోజీ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. గతంలో ఇలా తమిళ సినిమాలకు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చేది. ఇప్పుడు అక్కడ వచ్చిందన్నమాట.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?