Virata Parvam movie: ఓటీటీలో రానా మూవీ.. నిజమేంటంటే..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏప్రిల్ నెల చివరి వారం నుంచి థియేటర్లు మూతబడ్డాయి. చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. అయితే చాలామంది దర్శకనిర్మాతలు ఆలస్యమైనా తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రానా నటించిన విరాటపర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు వేణు ఊడుగుల ఈ వార్తలపై స్పందిస్తూ విరాటపర్వం సినిమాను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.

థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతుందని కరోనా కేసులు తగ్గిన తరువాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని దర్శకుడు వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రానా, సాయిపల్లవి ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. సాయిపల్లవి ఈ సినిమాలో డీగ్లామరస్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తున్నారు.

నీది నాది ఒకే కథ సినిమాతో మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల ఆ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు. విరాటపర్వం సినిమాతో వేణు ఊడుగుల దర్శకునిగా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి, దగ్గుబాటి సురేశ్ బాబు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus