Venu Yeldandi: కూతురిని ఎత్తుకుని.. వేణు ఎల్దిండి ఎమోషనల్ పోస్ట్ వైరల్

కెరీర్ ప్రారంభంలో ‘రణం’ ‘ఖతర్నాక్’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ‘మున్నా’ చిత్రంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు టిల్లు అలియాస్ వేణు. అయితే ‘జబర్దస్త్’ కామెడీ షో అతని రేంజ్ ను ఇంకా పెంచింది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ పీక్స్ లో ఉన్నప్పుడే బయటకు వచ్చేసి రైటర్ గా పలు సినిమాలకు పనిచేసి, ఎట్టకేలకు దిల్ రాజు చిన్న బ్యానర్లో ‘బలగం’ అనే సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది.

రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ ఏర్పడకపోయినా.. మౌత్ టాక్ తో ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ.4 కోట్లకి ఓటీటీకి ఇచ్చేయాలనుకున్న ఈ సినిమా థియేటర్లలో రూ.25 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది. దీంతో మళ్ళీ దిల్ రాజు బ్యానర్లోనే ఇంకో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు వేణు అంటూ టాక్ నడిచింది. కానీ ఆ విషయం పై క్లారిటీ రాలేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. వేణు (Venu Yeldandi) రెండోసారి తండ్రయ్యాడు.

అవును వేణు సతీమణి తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హ్యాపీ న్యూస్ ని వేణు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “మాకు పాప జన్మించింది. ఈ శుభవార్తని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను” అంటూ వేణు పేర్కొన్నాడు. ఆల్రెడీ వేణుకి ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు రెండో సంతానంగా అమ్మాయి పుట్టినట్టు స్పష్టమవుతుంది.

https://twitter.com/VenuYeldandi9/status/1715319249298923931

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus