‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. వర్షాల వల్ల కలెక్షన్స్ పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ప్రమోషన్ డోస్ పెంచి.. జనాలను థియేటర్ కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ‘సరిపోదా శనివారం’ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ‘క్యూ అండ్ ఎ’ మీట్లో దర్శకుడు వివేక్ ఆత్రేయకి (Vivek Athreya) ఓ ప్రశ్న ఎదురైంది.
‘సరిపోదా శనివారం’ సెకండ్ హాఫ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. లెంగ్త్ ఎక్కువైందని, సాగదీసినట్టు ఉందని, లాజిక్స్ మిస్ అయ్యాయని..ఇలా చాలా మంది అభిప్రాయపడ్డారు. వీటి గురించి టీంకి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఓ రిపోర్టర్ మాత్రం.. ”సరిపోదా శనివారం’ లో సీఐ దయా.. సోకుల పాలెం జనాలని చిత్ర హింసలు పెడుతుంటే.. వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోయారు. అతను అరెస్ట్ చేసి వేధించినా.. బయటకు వచ్చాక ఎందుకు వేరే చోటికి వెళ్ళిపోరు?” అంటూ ప్రశ్నించాడు.
దీనికి దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) .. ‘సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్లు’ ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో నాని (Nani) చొరవ చేసుకుని ఆ రిపోర్టర్..ను ‘ ‘కాన్సార్’ ఎక్కడ ఉంది అండి? అక్కడే ఉంది కదా? ‘సోకులపాలెం’ మాత్రం అక్కడుండకూడదా? మీరు పెద్ద సినిమాల విషయంలో లాజిక్కులు వెతకడం లేదు. ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) టీం ఓ యాక్షన్ మూవీ చేశారు కాబట్టి లాజిక్కులు వెతుకుతున్నారు. ‘సరిపోదా శనివారం’ అనేది మంచి ఎక్స్పీరియన్స్. లాజిక్స్ తీసేసి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్..ని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.