Vv Vinayak: ‘భీమ్లా’ లో వినాయక్ ఎపిసోడ్ అలా సైడ్ చేశారట..!

పవన్ కళ్యాణ్- రానా కలయికలో వచ్చిన ‘భీమ్లా నాయక్’ మొదటి వీకెండ్ బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో అదే ఏపిలో టికెట్ రేట్ల ఇష్యు, బెనిఫిట్ షోలు లేకపోవడం,5 వ షోకి అనుమంతి లేకపోవడం.. వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వసూళ్ళను రాబట్టడం మామూలు విషయం కాదు. రేపు శివరాత్రి సెలవు ఉండడం, ఇంకో వీకెండ్ అడ్వాంటేజ్ ఉండడం కూడా భీమ్లా నాయక్ కు కలిసొచ్చే అంశం.

ఇదిలా ఉండగా ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ ను, తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే ఒరిజినల్ ను చూసేసిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అభిమానులకి మాత్రం ‘భీమ్లా’ కొంత నిరాశపరిచినట్టు స్పష్టమవుతుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించిన త్రివిక్రమ్.. తన పైత్యానికి తగినట్టు కొన్ని మార్పులు చేయడం, కొన్ని రొటీన్ అంశాలను జోడించడం వంటివి కొంతమైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే.. ఓ విషయంలో మాత్రం భీమ్లా పెద్ద తప్పే చేసిందని చెప్పాలి.

అదేంటి అంటే ‘భీమ్లా నాయక్’ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా నటించారు.ఈ సినిమాలో ఆయనకి సంబంధించి చిన్న కేమియో ఉంది. కానీ ఎడిటింగ్లో దానిని తొలగించారు. నిజానికి ఈ మూవీలో వినాయక్ నటించినట్టు ‘భీమ్లా’ టీం ఎక్కడా చెప్పలేదు. నేరుగా వినాయకే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో తాను దర్శకుడిగానే కనిపించబోతున్నట్టు వెల్లడించారు. కానీ కట్ చేస్తే ఆయన ట్రాక్ ను ఎడిటింగ్ లో లేపేశారు. రానా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు వినాయక్ ఫోన్ చేస్తున్నట్టు చూపించి మమ అనేసారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus