Vv Vinayak: హిందీ ఛత్రపతి హీరో గురించి డైరెక్టర్ వినాయక్ అలా అన్నారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వినాయక్ హిందీ ఛత్రపతి సినిమాతో సక్సెస్ సాధించి సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. హిందీ ఛత్రపతి ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. వీవీ వినాయక్ హిందీ ఛత్రపతి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నేటి యువతలో చాలామంది తెలుగు ఛత్రపతి చూసి ఉండరని అన్నారు. వాళ్లు హిందీ రీమేక్ ఛత్రపతి చూస్తే మాత్రం కచ్చితంగా ఫ్రెష్ గా ఉంటుందని ఆయన తెలిపారు.

ఇప్పటికే తెలుగు ఛత్రపతి చూసిన వాళ్లు హిందీ ఛత్రపతి చూస్తే ఆ సినిమాను పాడు చేయకుండా ఈ సినిమా తీశానని చెబుతారని వినాయక్ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, సాంగ్స్, లొకేషన్స్ కొత్తగా ఉంటాయని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను చూసిన వాళ్లకు ప్రాపర్ హిందీ మూవీ చూసిన భావన కలుగుతుందని ఆయన తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి అక్కడ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయని వినాయక్ అన్నారు. హిందీ ఛత్రపతి కోసం సాయి శ్రీనివాస్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడని ఆయన తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో సాయి శ్రీనివాస్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయానని వినాయక్ వెల్లడించడం గమనార్హం.

హిందీ ఛత్రపతితో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో హీరోగా నిలిచిపోతాడని వినాయక్ పేర్కొన్నారు. యాక్టింగ్ విషయంలో ప్రభాస్ కు, సాయికి పోలికలు వద్దని ఆయన చెప్పుకొచ్చారు. హీరో పాత్రకు సాయి శ్రీనివాస్ న్యాయం చేశాడని మాత్రం చెప్పగలనని వినాయక్ అన్నారు. ఈ సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తున్నామని వినాయక్ వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి శ్రీనివాస్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus