ఒక కుటుంబం నుండి ఇద్దరు వారసులు హీరోలు ఒకేసారి లాంచ్ అవుతున్నారు అంటే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇద్దరూ ఒకే సమయంలో వస్తున్నారు అంటే ఇంకా ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది నందమూరి కుటుంబంలో. ఓవైపు బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) వస్తుంటే.. మరోవైపు దివంగత జానకీరామ్ (Janaki Ram Nandamuri) తనయుడు ఎన్టీఆర్ కూడా లాంచ్ అవ్వబోతున్నాడు. ఈ సినిమా ప్రచారాన్ని దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి (YVS Chowdary) తనదైన శైలిలో చేస్తున్నారు.
వరుస ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సినిమాను, సినిమా టీమ్‌ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హీరో కోసం ఓ మూడు, నాలుగు ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన.. ఇప్పుడు హీరోయిన్ కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్, పరిచయం చేశారు. ఈ క్రమంలో ఆయనకు చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వాటికి ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోతుండటంతో ఇబ్బంది పడుతున్నారు, పెడుతున్నారు కూడా. కావాలంటే మీరే చూడండి.. కొత్త ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుండి వైవీఎస్ చౌదరి వ్యవహారశైలి భిన్నంగా ఉంది.
నందమూరి వంశంలో నాలుగో తరం హీరోను పరిచయం చేస్తున్నాను.. ఈ క్రమంలో కుటుంబంలోని అందరి ఆశీస్సులు ఉన్నాయి అని చెబుతున్నారు. అయితే ఎవరు ముందుకొస్తారు, ఎవరు హీరోను పరిచయం చేస్తారు అని మాత్రం చెప్పడం లేదు. నందమూరి తారకరామారావును హీరోగా పరిచయం చేస్తా అని చెప్పినప్పుడు జానకిరామ్ భార్య కొన్ని కండిషన్స్ పెట్టారని, ఆ రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నా అని చెప్పారు.
అయితే అవేంటో చెప్పడం లేదు. అయితే మోక్షజ్ఞకు బాలయ్య లాంటి సపోర్టు ఇన్‌స్టంట్‌గా ఉంది. మరి ఎన్టీఆర్‌కు ఎవరు ఇస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే వారసుడు ఎంట్రీ ప్రచారానికి ఆ కుటుంబ పెద్ద ముందుకు రాకపోతే ప్రేక్షకులకు నెగిటివ్ వైబ్స్ వెళ్తాయి. మరి ఈ విషయంలో వైవీఎస్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కనీసం పక్కాగా సమాధానాలు అయినా చెప్పాలి.