యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. స్టూడెంట్ నంబర్1, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించాయి. తారక్ నటించిన మరికొన్ని సినిమాలు యావరేజ్ ఫలితాలను సొంతం చేసుకుని ఫ్యాన్స్ మెప్పు పొందాయి.
అయితే తారక్ నటించిన కొన్ని సినిమాలు ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. నిన్ను చూడాలని, సుబ్బు, నాగ, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, శక్తి, రభస సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగల్చడంతో పాటు ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు. అయితే గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ నటించిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవర, వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో తారక్ కు ట్రిపుల్ హ్యాట్రిక్ అందించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సైమా అవార్డ్స్ వేడుక కోసం తారక్ దుబాయ్ కు వెళ్లారు. తారక్ కు అవార్డ్ వచ్చిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా తన సొంత బ్యానర్ ను యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో తారక్ నటిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నారు. తారక్ సినిమాలకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!