Shamshera: బాలీవుడ్‌కి మరో దెబ్బ.. రణబీర్ సినిమా కూడా బోల్తా కొట్టిందే!

బాలీవుడ్ స్టార్ హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. అప్పుడెప్పుడో ‘సంజు’ సినిమాతో అలరించిన ఈ హీరో లేటెస్ట్ గా ‘షంషేరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు మంచి బజ్ వచ్చింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. కరణ్ మల్హోత్రా దర్శకుడు. నిజానికి 2018లోనే ఈ సినిమాను మొదలుపెట్టారు. కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.

ఫైనల్ గా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి ఓపెనింగ్స్ లేవు. బాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలవబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటు క్రిటిక్స్ కానీ.. అటు ప్రేక్షకులు కానీ ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడం లేదు. ఒక క్రిటిక్ అయితే గత పదేళ్లలో వచ్చిన బోరింగ్ సినిమా ఇదేనని కామెంట్స్ చేశారు. క్రిటిక్స్ అందరూ కూడా నెగెటివ్ రివ్యూలే ఇస్తున్నారు.

ప్రేక్షకుల నుంచి కూడా బ్యాడ్ టాకే వస్తుంది. రణబీర్ పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేవని అంటున్నారు. కోవిడ్ కారణంగా బాలీవుడ్ మార్కెట్ బాగా ఎఫెక్ట్ అయింది. పెద్ద సినిమాలకు సైతం ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. పాజిటివ్ టాక్ వచ్చినా.. సరైన ఫలితం ఉండడం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొదలవ్వడమే బ్యాడ్ టాక్ తో మొదలైంది.

ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. త్వరలోనే రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus