Disco Shanti: వైరల్ అవుతున్న డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్!

శ్రీహరి భార్య డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీహరితో పెళ్లికి ముందు సినిమాలు చేసిన డిస్కో శాంతి పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కాలేయ సంబంధిత సమస్యలతో శ్రీహరి మృతి చెందారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంత ఉన్నా ప్రకాశ్ రాజ్ మా ఇంటి అల్లుడు అని డిస్కో శాంతి అన్నారు. నాకు, నా సిస్టర్ కు మధ్య ఎలాంటి సమస్య లేదని డిస్కో శాంతి పేర్కొన్నారు.

శ్రీహరి సినిమాలలో చాలా సినిమాలు ఇష్టమని ఆమె అన్నారు. బావ నాకు సినిమాలు చూపించి ఒపీనియన్ అడిగేవారని డిస్కో శాంతి వెల్లడించారు. పోసాని గారు ఉదయం 3 గంటలకు వచ్చి శ్రీహరికి కథలు చెప్పేవారని ఆమె అన్నారు. నేను కథలలో చిన్నచిన్న కరెక్షన్స్ చెప్పేదానినని డిస్కో శాంతి వెల్లడించారు. నేను చెప్పిన సూచనలను బావ, పోసాని, దర్శకులు తీసుకునేవారని డిస్కో శాంతి అన్నారు.

తమిళనాడులోని అమ్మవారి గుడిలో శ్రీహరికి, నాకు పెళ్లి జరిగిందని ఆమె తెలిపారు. అమ్మకు కూడా తెలియకుండా పెళ్లి జరిగిందని ఆమె తెలిపారు. బావ చనిపోయిన తర్వాత నేను తాగుడికి బాగా అలవాటు అయిపోయానని డిస్కో శాంతి వెల్లడించారు. ప్రస్తుతం గుడిసెలో ఉండేవాళ్లు కూడా తాగుతున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరూ తాగుతున్నారని ఆమె అన్నారు.

నేను రెండు మూడుసార్లు హాస్పిటలైజ్ అయ్యానని రెండు మూడుసార్లు కింద పడిపోయానని డిస్కో శాంతి వెల్లడించారు. మధ్యలో మద్యం తాగడం మానేశానని ఆ తర్వాత అప్పుడప్పుడూ తాగానని ఆమె కామెంట్లు చేశారు. పిల్లల కోసం ప్రస్తుతం నిర్ణయం మారిందని డిస్కో శాంతి వెల్లడించారు. మనవడు, మనవరాలిని ఎత్తుకునే వయస్సు వచ్చిందని ఆమె అన్నారు. డిస్కో శాంతి (Disco Shanti) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus