Karthi, Suriya: సినిమా హిట్ అవడంతో కాస్ట్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్?

ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు పెద్ద ఎత్తున నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ హీరోలకు దర్శకులకు కానుకలు ఇవ్వడం మనం చూస్తున్నాము. విక్రమ్ సినిమా మంచి హిట్ అవడంతో కమల్ హాసన్ డైరెక్టర్ కి అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లకు పెద్ద ఎత్తున ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం చూస్తున్నాము. ఇదిలా ఉండగా తాజాగా హీరో కార్తీక్ నటించిన విరుమన్ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ముత్తయ్య దర్శకత్వంలో 2 డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని హీరో సూర్య నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ శక్తివేలన్‌ అన్నదమ్ములు సూర్య, కార్తీలతో పాటు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో, విరుమన్‌ సహనిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌కు ఖరీదైన డైమండ్ బ్రాస్లెట్స్ కానుకగా ఇచ్చారు.

ఇలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించినందుకు డైరెక్టర్ ముత్తయ్యకు డిస్ట్రిబ్యూటర్స్ డైమండ్ రింగ్ బహుకరించారు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా మంచి హిట్ అయి డిస్టిబూటర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఇలా చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు అందజేశారు.

గ్రామీణ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలైంది. ఇకపోతే సూర్య నిర్మాణంలో కార్తీక్ నటించిన ఈ సినిమా రెండవ సినిమా కావడం విశేషం ఇదివరకే సూర్య నిర్మాణంలో కార్తీ చిన బాబు అనే సినిమాలో నటించారు.ఇక హీరో సూర్య విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బాల దశకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus