‘బిగ్ బాస్ 9′(తెలుగు) లో మరో ఇద్దరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు ఆయేషా జీనత్ కాగా మరొకరు దివ్వెల మాధురి. పొలిటీషియన్ దువ్వాడ శ్రీనివాస్ ను గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈమె.. సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ నిలుస్తూ వచ్చారు. ఫైనల్ గా ఆమె ‘బిగ్ బాస్’ కి ఎంట్రీ ఇవ్వడంతో షోకి అదనపు ఆకర్షణ చేకూర్చినట్టు అయ్యింది.
ఆమె మాట్లాడుతూ.. ” నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే నాకు పెళ్లి చేసేశారు. తర్వాత ముగ్గురు ఆడపిల్లలకు తల్లయ్యాను. అయితే నా భర్తతో మొదటి నుండి నాకు అండర్ స్టాండింగ్ అనేది తక్కువగానే ఉండేది. అతన్ని అర్థం చేసుకుని కలిసుండటానికి చాలా ప్రయత్నించాను. కానీ ఒక స్టేజి వచ్చాక.. నా వల్ల కాలేదు. అందుకే నా మొదటి భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. గత 4 ఏళ్ళ నుండి శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ అన్నట్టుగా మేము జీవిస్తున్నాం.
అయితే సోషల్ మీడియాలో మాత్రం నా పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఒక రకంగా అవి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. దారుణం ఏంటంటే..నా కూతుళ్ల పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నేను జీవితంలో ఎన్నో నెగిటివ్ సిట్యుయేషన్స్ ని ఫేస్ చేసి వచ్చాను. నేను ఒక వైపు, సొసైటీ ఇంకో వైపు అన్నట్లు నా జీవితం సాగింది. నేను ఏంటో ఈ షో ద్వారా అయినా జనాలు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ ని ఎంపిక చేసుకున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు దివ్వెల మాధురి.