రీసెంట్ గా విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ చాలా కాలం తరువాత థియేటర్లో హిట్టు కొట్టారు. దీంతో సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో ఓ విలేకరి సినిమా కలెక్షన్స్, నెంబర్స్ గురించి ప్రశ్నించగా.. ఈ లెక్కలన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ ఆడియన్స్ కు అక్కర్లేదు.
వాడు ఇచ్చే 150 రూపాయలకు నవ్వుకున్నాడా..? లేదా..? అనేది సరిపోతుంది. వాడిచ్చిన 150 రూపాయలకు 1500 నవ్వించేశాం.. కాబట్టి వాడు హ్యాపీ అంటూ ఆడియన్స్ ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఇలా ఏకవచనంతో మాట్లాడడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆడియన్స్ ను ఎలా ట్రీట్ చేయాలో తెలియదా..? అంటూ మండిపడుతున్నారు. నాగవంశీని తిడుతూ.. సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందిస్తూ..
ప్రేక్షకులకు సారీ చెప్పారు నాగవంశీ. ”ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో ‘డిజె టిల్లు’ విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే.
అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
— Naga Vamsi (@vamsi84) February 18, 2022
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!