కియారా అద్వానీ అసలు పేరేంటో మీకు తెలుసా..?

చాలామంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పేర్లు మార్చుకున్నారనే సంగతి తెలిసిందే. కొందరు లక్ కోసం పేరు మార్చుకుంటే మరికొందరు మాత్రం అదే పేరుతో పాపులర్ అయిన సెలబ్రిటీ ఉన్నా లేక పేరు బాలేకపోయినా పేరు మార్చుకోవడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ.

అయితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్లే కియారా అద్వానీ పేరును మార్చుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కియారా ఈ విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ లో అప్పటికే అలియా భట్ ఉండటంతో పేరు మార్చుకున్నానని కియారా అన్నారు. తన పేరుతో మరో హీరోయిన్ పేరు ఉండటంతో సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని సూచించారని ఆమె చెప్పారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్ల పేర్లు ఉండకూడదని సల్మాన్ ఖాన్ చెప్పారని ఆమె అన్నారు.

సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని చెప్పడంతో అలియా అద్వానీ పేరు కియారా అద్వానీగా మారింది. 2014 సంవత్సరంలో ఫుగ్లి సినిమాతో కియారా నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు. రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా కియారా అద్వానీ నటించారు. మహేష్ తో కియారా నటించిన సినిమా హిట్ కాగా రామ్ చరణ్ తో ఆమె కలిసి నటించిన సినిమా మాత్రం ఫ్లాప్ కావడం గమనార్హం.

తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లలో కియారాకు ఛాన్సులు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కియారా అద్వానీ తెలుగులో కూడా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus