Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు ఏం చేస్తారో?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా విషయం హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డారు. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరు పెళ్లి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో వీరి గురించి తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వీరిద్దరూ తమ వివాహాన్ని ఇటలీలో చేసుకోబోతున్నారు అంటూ ఉపాసన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం అధికారకంగా ప్రకటించలేదు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీరి వివాహం అక్టోబర్ చివరి వారంలోనూ లేదా నవంబర్ మొదటి వారంలోనే జరగబోతుందని తెలుస్తుంది.

ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం జరగబోతుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠిన కోడలుగా అంగీకరించడం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక మెగా ఫ్యామిలీతో పోల్చుకుంటే లావణ్య త్రిపాటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఏమాత్రం తీసుపోదని చెప్పాలి. లావణ్య త్రిపాఠి ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయి లాగే ఉంటారు అనడంలో సందేహం లేదు. ఒక వీరికి ఆస్తిపాస్తులు కూడా భారీగానే ఉన్నాయని చెప్పాలి.

ఇక లావణ్య త్రిపాటికి (Lavanya Tripathi) ఒక సోదరుడుతో పాటు ఒక సోదరి కూడా ఉన్నారు. వీరి తల్లి గవర్నమెంట్ టీచర్ లావణ్య తండ్రి హైకోర్టు న్యాయమూర్తి గా చేశారట . ఇలా వీరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను ప్రేమిస్తున్నాను అనే విషయం తెలియడంతో మొదట్లో షాక్ అయినటువంటి లావణ్య కుటుంబం అనంతరం మెగా కుటుంబం గురించి వరుణ్ తేజ్ గురించి తెలిసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నారట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus