Naga Shaurya: నాగశౌర్య కంటే భారీగా సంపాదిస్తున్న అనూష శెట్టి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నాగశౌర్య ఒకరు నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా అనంతరం ఈయన పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటు హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఈయన తన సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవని చెప్పాలి. ఇలా హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన గత ఏడాది నవంబర్ నెలలో బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడిచారు.

వీరిద్దరూ వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక అనూష శెట్టి బెంగళూరులోనూ అలాగే హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్స్ అలాగే స్టార్స్ సెలబ్రిటీల ఇంటికి డిజైనర్ గా పనిచేస్తూ వృత్తి పరంగా ఆమె కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తూ నెలకు భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈమె సంపాదన తన భర్త నటుడు నాగశౌర్య కంటే రెండింతలు అధికంగా ఉందనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

నాగశౌర్య (Naga Shaurya) ఒక్కో సినిమా చేస్తే దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు అయితే అనూష శెట్టి నెలకు 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటుందని తెలుస్తుంది. ఈమె నాగశౌర్య ఏడాదికి సంపాదించే సంపాదన ఆరు నెలలలోనే సంపాదిస్తుందని తెలుస్తోంది. ఇక నాగశౌర్య పెళ్లి తర్వాత హైదరాబాదులోనే వేరు కాపురం ఉంటున్నట్లు ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో నాగశౌర్య తల్లి వెల్లడించారు. ఇలా వీరిద్దరూ తమ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం విశేషం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus