పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్లో ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని క్రేజ్ ను సంపాదించుకున్న హీరో. చాలా మంది లాయల్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఏకైక హీరో అని చెప్పినా అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన అన్నని మించిన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోగా కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. అలా అని పవన్ కళ్యాణ్ మాస్ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదగలేదు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి ఇవన్నీ కూడా ప్రేమ కథలే. వాటితోనే పవన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ లో హైలెట్స్ గురించి చెప్పుకోవాలి అంటే అతని హెయిర్ స్టైల్ మొదట అందరికీ గుర్తొస్తుంది. మధ్య పాపిడి దువ్వినా.. అతనంత అందంగా ఎవ్వరూ కనపడరు అంటే అతిశయోక్తి అనిపించుకోదేమో.
టాలీవుడ్లో చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి చేయించుకున్నారేమో.! పవన్ కళ్యాణ్.. ది మాత్రం ఒరిజినల్ హెయిర్. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఓ సినిమాలో విగ్గు పెట్టుకుని కనిపించిన సందర్భం ఉంది. ఆ మాట చెప్పగానే అంతా.. ‘తొలిప్రేమ’ సినిమాలోనేమో అనుకుంటారు. ఆ సినిమాలో రెట్రో లుక్ లో కనిపించినప్పుడు పవన్ విగ్గు వాడారు.
ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో కూడా ‘కెవ్వు కేక’ పేరడీ సాంగ్ లో పవన్ విగ్గు వాడారు. కానీ వాటి గురించి కాదు ఇప్పుడు చెప్పేది. ‘జల్సా’ సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని సన్నివేశాలకి విగ్గు వాడారు. కానీ అది చాలా నేచురల్ గా ఉండటం వల్ల ఎవ్వరూ గుర్తుపట్టలేదు.