రాంగోపాల్ వర్మ … పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్లో ఉన్న టాప్ టెక్నీషియన్స్ లో ఇతను కూడా ఒకడు. బాలీవుడ్లో కూడా సత్తా చాటాడు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో, సినిమాకి పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో ఆర్జీవీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ రాంగోపాల్ వర్మ గురించి చాలా గొప్పగా చెప్పాడు. బాలీవుడ్ ఫిలిం మేకింగ్ స్టైల్ ను రాంగోపాల్ వర్మ మొత్తం మార్చేసాడని. కొత్త టెక్నాలజీని పరిచయం చేసాడని అతను చెప్పాడు.
‘సత్య’ లాంటి సినిమాలు తీసినా దెయ్యాల సినిమాలు తీసినా రాంగోపాల్ వర్మని మించి ఎవ్వరూ తీయలేరు అని అక్కడి వాళ్ళు భావిస్తారట. ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ – (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ అభిమానులను గిల్లుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. అందుకు ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ఓ సినిమా రావాల్సింది.
కానీ మిస్ అయ్యింది. వంశీ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ నిర్మాణంలో వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం వర్మ మొదట పవన్ ని సంప్రదించాడట. కానీ అందుకు పవన్.. ‘నేను ఇలాంటి సినిమాలు చేయను సార్’ అని వర్మకి డైరెక్ట్ గానే చెప్పాడట. ఇటీవల రాంగోపాల్ వర్మ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్