Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టారు. ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి రాజమౌళి కుటుంబంలోని పుట్టి పెరిగారనే సంగతి తెలిసిందే. ఇకపోతే కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా రాజమౌళికి (Rajamouli) సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి దర్శకుడిగా మాత్రమే కాకుండా బాల నటుడిగా ఒక సినిమాలో నటించారట అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల రిలీజ్ కాలేదు మరి ఈయన నటించినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాణంలో తన బాబాయ్ శివశక్తి దత్త దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం పిల్లన గ్రోవి.

ఈయన 10 సంవత్సరాల వయసులో ఈ సినిమాలో నటించారట అంతే కాకుండా ఈ సినిమాలో తన సోదరి శ్రీలేఖ కూడా నటించారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చే సమయానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేక విడుదలకు నోచుకోలేదు అలా రాజమౌళి నటించినటువంటి ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా కనుక విడుదలయ్యి మంచి సక్సెస్ అయ్యి ఉంటే బహుశా ఈయన డైరెక్షన్ వైపు కాకుండా నటన వైపు వెళ్లే వారేమో అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus