Alia Bhatt Saree Cost: చీర కొంగు పై రామాయణం!

అయోధ్యలోని బాల రామ మందిర ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి రణబీర్ కపూర్ అలియా భట్ కూడా హాజరై సందడి చేశారు. వీరిద్దరూ ఈ వేడుకలో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆలియా భట్ సిల్క్ చీర ధరించి ఎంతో అందంగా సాంప్రదాయ బద్ధంగా కనిపించారు. అయితే ఈమె చీర మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రత్యేకంగా ఈ చీరను డిజైన్ చేయించి చీర కొంగుపై రామాయణానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను డిజైన్ చేయించారని తెలుస్తోంది. దాదాపు పది రోజులపాటు ఈ చీరను కష్టపడి డిజైన్ చేశారట. ఈ చీర కొంగుపై రాముడు శివధనస్సును విరచడం సీతాదేవిని పెళ్లి చేసుకోవడం అడవులకు వెళ్లడం అక్కడ సీత అపహరణ జరగడం రామసేతు బ్రిడ్జ్ నిర్మించడం వంటి కొన్ని కీలకమైన ఘట్టాలన్నింటిని కూడా తన చీర కొంగుపై ఎంతో అద్భుతంగా చూపించారు.

ఇలా అలియా (Alia Bhatt) చీర కొంగుపై రామాయణం కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈమె కట్టిన ఈ చీర ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ వేడుకలో అందరి కళ్ళు కూడా అలియా భట్ చీర పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ధరించిన ఈ చీర ఖరీదు 45 వేల రూపాయలని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చీరకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus