Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ దూకుడుకి తట్టుకోలేక ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. టీజర్, ట్రైలర్ తోనే ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ‘పెళ్ళి చూపులు’ చిత్రంలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ .. ‘అర్జున్ రెడ్డి’ లో కంప్లీట్ డిఫెరెంట్ గా కనిపించి మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్ యూత్ పై చాలా ప్రభావితం చేసింది.

ఓ రకంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) అనేది గేమ్ ఛేంజర్ మూవీ అని చెప్పాలి. అప్పటి వరకు ఇలాంటి స్క్రీన్ ప్లే తో ఏ సినిమా రాలేదు. కథ పరంగా చెప్పుకోడానికి ఇందులో ఏమీ ఉండదు. ఓ అమ్మాయి , అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్ళికి హీరోయిన్ తండ్రి ఒప్పుకోలేదు. దీంతో వేరే పెళ్ళి చేసేస్తాడు. దీంతో హీరో డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు. ఇలాంటి కథతో ‘దేవదాసు’ వచ్చింది. కానీ స్క్రీన్ ప్లే పూర్తిగా వేరు.

Arjun Reddy

2017 ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా పక్కన రిలీజ్ అయిన కొన్ని క్రేజీ సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటంటే.. ధనుష్ హీరోగా వచ్చిన ‘వి.ఐ.పి 2 ‘. ‘రఘువరన్ బి టెక్’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పై మొదట బజ్ ఉండేది.

Arjun Reddy

కానీ ‘అర్జున్ రెడ్డి’ ముందు ఈ సినిమా నిలబడలేదు. అలాగే బాలకృష్ణ ‘పైసా వసూల్’ , విశ్వక్ సేన్ ‘వెళ్ళిపోమాకే’ , అల్లరి నరేష్ ‘మీద మీద అబ్బాయి’ , నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ , నారా రోహిత్ – నాగ శౌర్య ల ‘కథలో రాజకుమారి’ , రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన ‘శ్రీవల్లి’ , సునీల్ నటించిన ‘ఉంగరాల రాంబాబు’… ఇలా ఈ సినిమాలు అన్ని ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ మేనియాలో కొట్టుకుపోయాయి.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus