తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు అయిన నటులు ఉన్నారు. వారిలో చాలా మంది రంగస్థలం నుంచి వచ్చిన వారే. వారిలో ఒకరే కళ్యాణం వెంకటసుబ్బయ్య. కానీ ఈ పేరు చెబితే ఈయన్ను ఎవరు గుర్తుపట్టరు. తెలుగు ఇండస్ట్రీ మొదటి హీరో “కళ్యాణం రఘురామయ్య” కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..? అదే ఈలపాట రఘురామయ్య అంటే చప్పున గుర్తుపడతారు కళాభిమానులు. అలాగే ఆయన పాడిన శ్రీ రామాంజనేయ యుద్ధం లోని ‘రామ నీల మేఘ శ్యామా’ పాత కూడా ఇప్పటికి వినిపిస్తూ ఉంటుంది.
తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు అలాగే గాయకుడు అయిన రఘురామయ్య తన శ్రావ్యమైన గాత్రం, ఈలపాట తో ఎంతో గుర్తింపు సాధించుకున్నారు. రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఈయన ప్రతిభను తెలుసుకొని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి మొదలైనవారు స్వయం గా ప్రశంసించారు. నెహ్రు గారు ఈయన తన చేతిలో ఏదైనా పరికరాన్ని దాచారా అని అడిగేవారట. గుంటూరు జిల్లా సుద్దపల్లి లో 1901, మార్చి 5 వ తేదీన కళ్యాణం నరసింహరావు, కళ్యాణం వేంకట సుబ్బమ్మ దంపతులకు రఘురామయ్య జన్మించారు.
చిన్ననాటి నుండే నాటకాలు వేసాడు. (First Hero) రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతిపొందాడు. అలాగే ఎన్టీఆర్ కంటే ముందు ఈయన్ని చూసి కృష్ణుడు అంటే ఇలాగే ఉండేవాడు అనుకొనేవారు ప్రజలు. రఘురామయ్యకి సంగీతం పుట్టుకతో వచ్చింది. పశువులు కాస్తూ, ఆవులను తన గానంతో నిలిపి వేయగలిగేవాడు. ఆయన ప్రతిభ ఒక ఈలపాట నాటక ప్రముఖుడి దృష్టిలో పడటంతో రఘురామయ్య మకాం గుంటూరుకు మారింది. ఆయనలోని నటననుచూసిన కాశీ నాధుని నాగేశ్వరరావు ఆయనకు రఘురామయ్యగా నామకరణం చేశారు. గుంటూరు చుట్టుపక్కల మొదలయిన రఘు రామయ్య నాటకాలు అనతికాలంలోనే ఆంధ్ర దేశ మంతా ప్రదర్శనకు నోచుకున్నాయి.
కొన్ని సినిమాల్లో పాత్రలు వేసినా, పాటలు పాడినా ఆయన మనసు మాత్రం నాటకరంగంమీదే. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా నాటకాలను ఎంతో హుషారుగా వెయ్యటమే కాకుండా భారత సాంస్కృతిక బృందంలో సభ్యుడిగా జపాన్, ఇతర తూర్పు ఆసియా ఖండ దేశాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన కృష్ణుడిగా మేకప్ వేసుకుని బయటకు వచ్చేసరికి జపాన్ లోని రామకృష్ణ మిషన్ సభ్యులందరు లేచి నిలబడి నమస్కారం చేశారు. అంత గొప్పగా వుండేది ఆయన కృష్ణుడి వేషం. కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందింది. ఆ అవార్డ్ ని నాటి రాష్ట్రపతి తెలుగు ప్రముఖుడు వి.వి. గిరి చేతులమీదుగా అందుకున్నారు.
అలాగే రఘురామయ్య ఈలపాట గురించి విన్న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికార నివాసానికి పిలిపించుకుని ఆయన ఈలపాట విన్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ తులాభారం ప్రదర్శించమని సత్యసాయిబాబా ఆహ్వానం అందుకుని ప్రదర్శించటమేకాక సాయి బాబా మన్ననలు పొందారు. అప్పటికి ఆయన వయస్సు డెబ్బెమూడు సంవత్సరాలు. రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు 100 చలన చిత్రాలలో నటించారు.
ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. రంగస్థల నటి ఆదోని లక్ష్మి గారితో ఈయన వివాహం 1938లో బాపట్లలో జరిగింది. వీరికి అయిదుగురు సంతానం. వీరిలో రూపాదేవి, కళ్యాణం రామకృష్ణ సినీ రంగం లో ఉన్నారు. రఘురామయ్య గారు తన 75వ ఏట 1975 లో గుండెపోటు తో మరణించారు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. ఆయన జన్మించిన సుద్దపల్లి గ్రామంలో ఇటీవలే ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!