ఉప్పు శోభన చలపతి రావు… ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఏర్పడుతుంది. అయితే శోభన్ బాబు అని చెబితే మాత్రం వెంటనే ఆయన అందం, నటన గుర్తుకొస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దైవ బలం’ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శోభన్ బాబు.. మొదట చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ… అటు తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా నటించి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ వల్లే ఆయన స్టార్ హీరోగా ఎదిగారు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో శోభన్ బాబు కూడా చేరారు. అయితే మిగిలిన స్టార్ హీరోల్లా తన సంపాదన మొత్తం సినిమాల్లోనే పెట్టకుండా… ఎక్కువగా భూములు కొనుగోలు చేసేవారు శోభన్ బాబు. ‘భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ కష్టాలు పాలు కారు’ అనేది ఆయన సిద్ధాంతం.
‘ఏదో ఒక రోజు ఆ భూదేవి మనల్ని ఆదుకుంటుంది’ అని కూడా శోభన్ బాబు పదే పదే చెప్పేవారట.ఆయన మాట వినే… స్నేహితులు మురళీమోహన్, చంద్రమోహన్ కూడా బాగా సంపాదించుకున్నారు. అయితే ఎంతో స్టార్ అయ్యుండి శోభన్ బాబు.. ఎందుకు తన పిల్లలను హీరోలను చేయలేదు అనే ప్రశ్న ఇండస్ట్రీలో చాలా మందికి ఉంది. నటుడు రాజారవీంద్రకి కూడా ఇదే ప్రశ్న ఉండేదట. ఒకరోజు ఉండబట్టలేక రాజారవీంద్ర.. శోభన్ బాబుని ఈ విషయమై ప్రశ్నించారు.
అందుకు ఆయన.. ‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎంతో కష్టపడ్డాను, అవమానాలు పడ్డాను. సక్సెస్ అయినప్పటికీ చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే… నేను పడ్డ కష్టాలు, నా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో.. వారికి సినిమాల పై ఇంట్రెస్ట్ ఉన్నా నేను వ్యతిరేకించాను’ అంటూ శోభన్ బాబు చెప్పుకొచ్చారని రాజా రవీంద్ర తెలిపారు. ఇక శోభన్ బాబుకి ఎక్కడ మొదలు పెడితే అక్కడే ఆపేయడం అలవాటని.. అందుకే ఆయన హీరోగానే కెరీర్ ను ఆపేశారని ఈ సందర్భంగా రాజారవీంద్ర చెప్పుకొచ్చాడు
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!