Polimera 2 Teaser: ‘పొలిమేర 2’ టీజర్లో..ఆ రెండిటినీ గమనించారా..?

ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ ‘మా ఊరి పొలిమేర’. 2021 డిసెంబర్ 10న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. ఈ సినిమా క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అప్పటికి ‘కాంతార’ కూడా రాలేదు. ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ లు ఉంటాయి. ఎండ్ కార్డు పడే వరకు ట్విస్ట్ లు పెట్టి..

దీనికి పార్ట్ 2 ఉంటుంది అని ముందే రివీల్ చేశాడు దర్శకుడు అనిల్ విశ్వనాధ్. కొంత గ్యాప్ తర్వాత ‘పొలిమేర 2’ రాబోతుంది. తాజాగా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్లో చేతబడి, కొమరయ్య(సత్యం రాజేష్) మళ్ళీ తన ఫ్యామిలీ వద్దకు రావడం వంటివి చూపించారు.అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి కూడా చూపించారు. ఫస్ట్ పార్ట్ లో కొమురయ్య అలాగే తన లవర్ చనిపోయినట్టు చూపించారు. అలాగే సర్పంచ్ రవి వర్మని కూడా తాను చేతబడి చేసి చంపేసినట్టు చూపించారు.

కానీ టీజర్ లో మళ్ళీ సర్పంచ్ కనిపించాడు. దీనిని బట్టి.. ఫస్ట్ పార్ట్ లో లాస్ట్ సీన్ గా చూపించింది అంత కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ‘మా ఊరి పొలిమేర’ లో హద్దులు మీరిన బెడ్ రూమ్ సన్నివేశాలు, బూతులు ఉంటాయి. సెకండ్ పార్ట్ లో అలాంటివి ఏమీ ఉండవని (Polimera 2) టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus