Double iSmart: పూరి – రామ్‌ – ఛార్మి సినిమా ముహూర్తం రెడీ.. ఎప్పుడంటే?

డిజాస్టర్‌ తర్వాత చేయబోయే సినిమాకు ఓ హీరో, డైరక్టర్, నిర్మాత ఎంత కసిగా ఉంటారో మాటల్లో వర్ణించలేం. కళ్లు విజయం కోసం ఎంత కష్టపడ్డాయో చెప్పేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న కాంబో రామ్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మి. ఈ ముగ్గురికి గత సినిమాలు దారుణమైన పరాజయాన్ని ఇచ్చినవే. పూరి – ఛార్మి కాంబోకు ఒకే సినిమా అయితే, రామ్‌కు వేరే సినిమా. ఈ ముగ్గురు కలసి ఇప్పుడు గతంలో భారీ విజయం అందుకున్న సినిమాకు సీక్వెల్‌ చేస్తున్నారు.

ఆ సీక్వెల్‌ గురించి ఇప్పటికే ప్రకటించారు కూడా. దాని రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేసేశారు. అయితే ఇప్పుడు చెబుతున్న డేట్‌ సినిమా ఓపెనింగ్‌ది. అవును రామ్‌ – పూరి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. పూరి జగన్నాథ్‌ ‘లైగర్’ సినిమా విడుదలై 11 నెలలు కావొస్తోంది. అప్పటి నుండి ఆయన ఖాళీగా ఉన్నారు. అయితే నటన, రచన పనుల్లో బిజీ అనుకోండి.

ఇన్నాళ్ల గ్యాప్‌లో ఓ ఓ పకడ్బందీ స్క్రిప్ట్‌తో పూరి సిద్ధంగా ఉన్నారట. మరోవైపు బోయపాటి ‘స్కంద’ షూటింగ్‌ నుండి రామ్‌ రిలీవ్‌ అవ్వడంతో పూరి తన సినిమా స్టార్ట్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 9న రామ్ – పూరి సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది అని సమాచారం. అంతేకాదు అక్కడికి మూడు రోజుల్లోనే అంటే జులైన 12 నుండి సినిమా రెగ్యులర్ షూట్ ఉంటుంది అని చెబుతున్నారు. దీనికి సంబంధిచిన విషయాలు ముహూర్తం రోజు వెల్లడిస్తారట.

అయితే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart) అని టైటిల్ పెట్టడంతో ఇది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెలా? లేక ఫ్రాంచైజీ లాంటిది ఏదైనా పూరి ట్రై చేస్తున్నారా? అనే డౌటానుమానం ఫ్యాన్స్‌లో ఉంది. అది ముహూర్తం రోజు తీరిపోతుంది అని అంటున్నారు. అన్నట్లు ఈ సినిమాను మార్చి 8, 2024న రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు కూడా.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus