డ్రాగన్ బాబుకు తెలుగులో మరింత పట్టు దొరికినట్లే..!

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన డ్రాగన్ (Return of the Dragon) తమిళనాట ఘన విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగులో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. దీనికితోడు, అదే సమయంలో విడుదలైన టాలీవుడ్ సినిమా మజాకా  (Mazaka) అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

Dragon

సందీప్ కిషన్ (Sundeep Kishan), రీతూ వర్మ (Ritu Varma) నటించిన ఈ సినిమా మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే, కథనంలోని బలహీనతలు సినిమా మీద ప్రభావం చూపించాయి. ఫస్ట్ వీకెండ్ వరకు కూడా వసూళ్లు పెరగకపోవడంతో, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. ఇదే సమయంలో డ్రాగన్ మాత్రం విజయవంతంగా దూసుకుపోతోంది. యూత్‌ను టార్గెట్ చేసిన కంటెంట్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా కలిపి ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ప్రదీప్ రంగనాథన్‌కి ఇచ్చిన రెస్పాన్స్ విశేషం. దీంతో వారం చివరికీ ఈ మూవీ బాక్సాఫీస్‌ను పూర్తిగా డామినేట్ చేసింది. అంతే కాకుండా మజాకా థియేటర్లు ఇప్పుడు డ్రాగన్ సినిమాకు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లోనూ డ్రాగన్ మంచి వసూళ్లు రాబడుతోంది.

ఇతర సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను ఆకర్షించలేకపోతున్న నేపథ్యంలో, థియేటర్లలో ఈ సినిమా షోలు హౌస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయి. ట్రేడ్ వర్గాలు చూస్తే, మరో వారం పాటు డ్రాగన్ అదే రీతిలో సక్సెస్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. మొత్తానికి, టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఈ వారాంతం డ్రాగన్ ఏలగా, మజాకా నిరాశపరిచింది. కానీ ముందుగా ఉన్న కొత్త సినిమాల విడుదలతో ఈ జోరు కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus