Drishyam 2: త్వరలో రూ.100 కోట్లకు ‘దృశ్యం 2’!

బాలీవుడ్‌కి అర్జెంట్‌గా హిట్‌ కావలెను.. గత కొద్ది నెలల నుండి ఈ మాట మనం వింటూనే ఉన్నాం. అలా అని బాలీవుడ్‌లో హిట్లు లేవా అంటే ఉన్నాయి. అయితే పాన్‌ ఇండియా సినిమాలుగా సౌత్‌లో రూపొంది అక్కడికి వెళ్లి హిట్ అయినవి. దీంతో సౌత్‌ సినిమాలే తోపు అని మన వాళ్లు జబ్బలు చరుచుకుంటున్నారు. ఈ క్రమంలో మన కథలు రీమేక్‌లు అయ్యి అక్కడికి వెళ్లాయి. కానీ అవి కూడా తుస్‌ మంటున్నాయి. అయితే ఇప్పుడు ఓ రీమేక్‌ సినిమా బాలీవుడ్‌ కరవు తీరుస్తోంది. ప్రజెంట్‌ ట్రెండ్‌ కొనసాగితే మంచి వసూళ్లు పక్కా అని అంటున్నారు.

మలయాళంలో చిన్న సినిమాగా రూపొందిన ‘దృశ్యం’ మొత్తం దేశమంతా రీమేక్‌ అవుతూ సంచలనంగా మారింది. ఆ తర్వాత దీని సీక్వెల్‌కి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పుడు ఉన్న జోరు కొనసాగితే పెద్ద నెంబర్లే నమోదవుతాయని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ పాఠ‌క్ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ ‘దృశ్యం 2’ చేశారు. మలయాళ ‘దృశ్యం 2’తో పోలిస్తే కొన్ని మార్పులు కూడా ఈ సినిమాలో చేశారు. ఇప్పుడు ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది.

‘దృశ్యం 2’ హిందీ వెర్షన్‌ తొలి రోజు రూ.15 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో శుభారంభం చేసింది. శ‌నివారం వ‌సూళ్లు మ‌రింత‌గా పుంజుకున్నాయి. మొత్తంగా రెండు రోజులకు రూ.25 కోట్ల దాకా గ్రాస్ వ‌చ్చింది. మూడు రోజులకు ఆ లెక్క రూ.64 కోట్లకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో రూ.100కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరడం ఖాయం అని బాలీవుడ్‌ సినిమా పరిశీలకులు చెబుతున్నారు. అలా బాలీవుడ్‌ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న హిట్‌ సినిమా ‘దృశ్యం 2’తో పడింది అంటున్నారు.

బాలీవుడ్‌లో ‘దృశ్యం 2’ ఎఫెక్ట్‌ గురించి చెప్పాలంటే.. అర్ధరాత్రి షోలు కూడా సినిమాకు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ బాలీవుడ్‌ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్‌ చూడలేదని ముంబయి మీడియా అంటోంది. అవును మరి జీతూ జోసెఫ్‌ ఆలోచన మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆయన ‘దృశ్యం 3’ పనుల్లో ఉన్నారు. సో బాలీవుడ్‌ మూడో ‘దృశ్యం’ చూడటానికి రెడీగా ఉండు. అజయ్‌ దేవగణ్‌ మరోసారి విజయ్‌ అవతారం ఎత్తుదువుగానీ.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus