‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ రైట్స్ చేతులు మారే ఛాన్స్ ఉందట..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ రీమేక్ రైట్స్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొనుగోలు చేసినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. రవితేజ, శర్వానంద్, వెంకటేష్ వంటి హీరోలలో ఒకరు ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని కూడా కథనాలు పుట్టుకొచ్చాయి. కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకి ఛాన్స్ ఉంటుంది. అయితే చరణ్ ఇప్పట్లో ‘డ్రైవింగ్ లైసెన్స్’ ను రీమేక్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

మరోపక్క ఈ చిత్రం రీమేక్ రైట్స్ ఇప్పుడు చేతులు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం డి.సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నాళ్ళ నుండీ సురేష్ బాబు ఒక్కరే సినిమాల్ని రిలీజ్ చేయడం లేదు. ఇంకో బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ వస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే.. చరణ్ తో కలిసి సురేష్ బాబు డ్రైవింగ్ లైసెన్స్ ను నిర్మిస్తారా లేక సురేష్ బాబుకి ఈ రీమేక్ రైట్స్ ఇచ్చేసి చరణ్ సైడైపోతాడా? అనేది అంతుచిక్కని విషయం.

ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే సురేష్ బాబు తన ‘దృశ్యం2’ ని ఓటిటిలో విడుదల చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.దాంతో ఆయన నిర్మిస్తున్న మరో 3 సినిమాలను కూడా ఓటిటికి ఇచ్చేసారట. అంతేకాకుండా… ఓటిటి సంస్థలతో కలిసి వెబ్ మూవీస్ ను నిర్మించే ఆలోచన కూడా సురేష్ బాబుకి ఉందని తెలుస్తుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus