Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

ఒక సినిమా దేశం మొత్తం రీమేక్‌ అవుతోంది.. చేసిన ప్రతి చోటా విజయం సాధిస్తోంది అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఇలాంటి సినిమాలు మన దగ్గర చాలా తక్కువే వచ్చాయి. ఆ కొద్ద సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో తొలుత రూపొందిన ఈ సినిమా.. ఆ తర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ.. వరుసగా రీమేక్‌లు అవుతూ వచ్చింది. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ ఇలానే జరిగాయి. అయితే మూడో సినిమా విషయానికొచ్చేసరికి ఓ చిన్న ఇబ్బంది వచ్చింది. అదే ఒకేసారి రిలీజా? లేక రీమేకా? అని. అయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అంటున్నారు.

Drushyam 3

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ‘దృశ్యం 3’కి సంబంధించి ఇప్పుడు చిక్కుముడి విడిపోయింది అని చెబుతున్నారు. ఎందుకంటే రిలీజ్‌ డేట్‌ విషయంలో మలయాళ సినిమా టీమ్‌ పట్టిన పట్టుకు హిందీ సినిమా టీమ్‌ డేట్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు సినిమా షూటింగ్‌ డేట్‌ను కూడా మార్చుకుంది అని చెబుతున్నారు. అంటే మలయాళంలో సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే హిందీలో సినిమా రిలీజ్‌ అవుతుంది అని చెప్పేయొచ్చు. హిందీ సినిమాను అక్టోబరు 2న రానుందని ప్రకటించడమే దీనికి కారణం.

మలయాళ వెర్షన్ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. వచ్చే వేసవిలో సినిమాను రిలీజ్ చేసే అవకాశముందని సమాచారం. ఈ సినిమా పనులు పూర్తవ్వగానే జీతూ జోసెఫ్‌ టాలీవుడ్‌ వచ్చి.. ఇక్కడ వెంకటేష్‌తో తెలుగు ‘దృశ్యం 3’ తెరకెక్కిస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఈలోపు వెంకీ – త్రివిక్రమ్‌ సినిమా ‘ఏకే 47’ షూటింగ్‌ను పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నారట. జీతూ జోసెఫ్‌ చాలా వేగంగా సినిమా పూర్తి చేస్తారని పేరు. ఆ లెక్కన 2026 ఆఖరులో తెలుగు మూడో ‘దృశ్యం’ రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. కుదిరితే అక్టోబరు 2నే రిలీజ్‌ చేసేయొచ్చు కూడా. చూద్దాం దీనిపై త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది.

దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus