‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి క్లాసిక్ తర్వాత వెంకటేష్ (Venkatesh Daggubati) మెయిన్ హీరోగా ‘షాడో’ (Shadow) వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘మసాలా’ (Masala) వచ్చింది పెద్ద ప్లాప్ అయ్యింది. అలాంటి టైంలో వెంకటేష్ హవా ముగిసింది అనే కామెంట్లు వినిపించాయి. సరిగ్గా అలాంటి టైం ‘దృశ్యం’ (Drushyam) వచ్చింది. 2014 జూన్ 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా అదే పేరుతో రూపొంది సూపర్ హిట్ అయిన ఈ సినిమా.
తెలుగులో కూడా అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 7.30 cr |
సీడెడ్ | 2.15 cr |
ఉత్తరాంధ్ర | 2.40 cr |
ఈస్ట్ | 1.08 cr |
వెస్ట్ | 0.75 cr |
గుంటూరు | 1.35 cr |
కృష్ణా | 1.07 cr |
నెల్లూరు | 0.55 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.85 Cr |
ఓవర్సీస్ | 1.50 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.00 cr |
‘దృశ్యం’ చిత్రం రూ.11.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా రూ.20 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.8.68 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.