టాలెంట్ ఎక్కడున్నా, తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించడం తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అలవాటు. ఆయన ట్విటర్‌లో చూస్తే ‘శబ్బాస్’ ట్వీట్లు చాలానే కనిపిస్తాయి. మరోవైపు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించి, అవకాశాలు ఇస్తుంటారు సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్. ఈ ముగ్గురూ కలస్తే… ఇంకేముంది ఆ గుర్తించిన టాలెంట్‌కు అవకాశాలే అవకాశాలు. తాజాగా ట్విటర్ వేదికగా ఇదే జరిగింది. మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అద్భుతంగా పాడుతుంటుంది.
ఊళ్లో వాళ్లంతా ఆమె పాడుతుంటే ఫిదా అయిపోతుంటారు. అలా సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి… ఆమె పాడుతున్న వీడియోను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. ఆ వీడియో చూసి స్పందించిన కేటీఆర్… ‘మంచి టాలెంట్…’ అంటూ దేవిశ్రీప్రసాద్, తమన్‌ను ట్యాగ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దాంతోపాటు తమన్, డీఎస్పీ స్పందించారు కూడా. ‘‘బంగారం లాంటి టాలెంట్ సర్’ అంటూ తమన్ రీట్వీట్ చేయగా, ‘చాలా మంది టాలెంట్ సర్.
ఈ అమ్మాయిలోని టాలెంట్‌ను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మేం చేయబోతున్న ఓ మ్యూజిక్ షోలో ఆమెను భాగం చేస్తాం’ అంటూ దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ అమ్మాయి గొంతు, వీడియో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఆ అమ్మాయి ఏ అవకాశం ఇస్తారో చూడాలి.