DSP: ఆ సినిమా డీఎస్పీ కెరీర్ ను డిసైడ్ చేయనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్ హవా అంతకంతకూ తగ్గుతోంది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి ప్రేక్షకులు ఆశించే స్థాయిలో ఔట్ పుట్ రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ది వారియర్ సినిమాతో డీఎస్పీ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. ది వారియర్ సినిమాలో పాటలు బాగానే ఉన్నా బీజీఎం ఏ మాత్రం ఆకట్టుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమా డీఎస్పీ కెరీర్ కు కీలకం కానుంది. సుకుమార్ సినిమాలకు డీఎస్పీ ఇప్పటివరకు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను నిరాశపరిచిన సందర్భాలు అయితే దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ పాటల విషయంలో, బీజీఎం విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కు మంచి మార్కులు పడ్డాయి. బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప ది రూల్ మ్యూజిక్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. పుష్ప ది రూల్ సినిమా ఒక విధంగా దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ ను డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు.

ఈ సినిమా మ్యూజిక్ విషయంలో విమర్శలు ఎదురైతే మాత్రం స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పవచ్చు. విమర్శలను దృష్టిలో ఉంచుకుని దేవిశ్రీ ప్రసాద్ మరింత జాగ్రత్తగా పని చేస్తే మంచిదని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు 3 నుంచి 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ కు ప్రస్తుతం థమన్, అనిరుధ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ కు స్టార్ హీరోలు క్రమంగా దూరమవుతున్నారు. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కు వరుసగా ఆఫర్లు ఇచ్చిన దర్శకనిర్మాతలు సైతం ఇప్పుడు ఆయనకు అవకాశాలను ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus