Dubbed Heroes: ‘వుయ్ లవ్ తెలుగు పీపుల్’ అంటూ పలికిన డబ్బింగ్ హీరోలు ఎక్కడ?

ఎలాంటి విపత్తు తలెత్తినా.. ప్రజలు కష్టాలు పడుతున్నారు అనే వార్త తెలిసినా… అన్ని పరిశ్రమల కంటే ముందుగా స్పందించి.. సహాయం చేయడానికి ముందుకొచ్చేది సినీ పరిశ్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భయంకరమైన వర్షాల కారణంగా తలెత్తిన వరదలు ప్రజల్ని అతలాకుతలం చేసేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలుపుకుని 30 మంది వరకు మరణించారు. లక్షల ఎకరాల్లోని పంట పాడైపోవడంతో రైతులు లభో దిభో అంటున్నారు.

Dubbed Heroes

ఇక లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం కావడంతో.. అక్కడ ఉండే ఇళ్లల్లోకి వర్షపు నీరు, డ్రైనేజీ నీరు కలిసొచ్చేసి.. సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పనక్కర్లేదు. అంతేకాదు చాలా చోట్ల ప్రజలు తినడానికి తిండి, తాగడానికి సరైన నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన హీరోలు అందరూ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , ప్రభాస్ (Prabhas) , మహేష్ బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi) , అల్లు అర్జున్ (Allu Arjun) , రాంచరణ్(Ram Charan) ..

ఇలా అందరూ కూడా కోట్లల్లో విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలు అనే కాదు… పక్క రాష్ట్రాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలుగు హీరోలు సాయమందించడానికి ముందుంటారు. చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయ్యింది కూడా..! అయితే ‘వుయ్ లవ్ తెలుగు పీపుల్’ అంటూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చే డబ్బింగ్ హీరోలు (Dubbed Heroes) ఎక్కడ.? వాళ్లలో ఏ ఒక్కరూ కూడా స్పందించి తెలుగు ప్రేక్షకులను ఆదుకోవడానికి ముందుకు రాలేదు.

ఒక్క సోనూ సూద్ (Sonu Sood)  మాత్రమే రూ.2 కోట్ల వరకు సాయం చేశాడు.తమ సినిమాలు ఆడాలని ప్రీ రిలీజ్ ఈవెంట్లలో డబ్బింగ్ హీరోలు చెప్పే కబుర్లు ఎంత కృత్రిమంగా ఉంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులు మాత్రం భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న ప్రతి సినిమాకి బాక్సాఫీస్ వద్ద పెద్ద పీట వేస్తుంటారు. అనన్య నాగళ్ళ (Ananya Nagalla) తప్ప హీరోయిన్లలో కూడా ఎక్కువ మంది ఈ విషయంలో స్పందించింది లేదు. డబ్బింగ్ హీరోలు (Dubbed Heroes) కూడా వాళ్ళకి సమానమని ఇప్పుడు ప్రూవ్ అయ్యింది.

‘కూలీ’ కి ‘జైలర్’ స్ట్రాటజీ… అంతకు మించి ఉంటుందట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus