Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ లో ఆ ఫాదర్ ను అందుకే తీసేశారట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం విజయదశమి కానుకగా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ తో పోలిస్తే ఈ మూవీలో చాలా మార్పులు చేశారు. అక్కడ సస్పెన్స్ అనుకున్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశారు.

అలాగే సవతి కూతురిని తెలుగు ప్రేక్షకుల సంతృప్తి కోసం చెల్లెల్ని చేశారు. అలాగే తమ్ముడి పాత్రను లేపేశారు. అసలు ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్రకి చాలా సస్పెన్స్ ఉంటుంది. ఆ పాత్ర సి.ఎం కొడుకా కాదా అనే సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్ గా చూపించి మాస్ ఆడియన్స్ బుర్రలకు పెద్దగా పరీక్ష పెట్టలేదు. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ తో పోలిస్తే ఈ సినిమాని థియేట్రికల్ గా హిట్ అనిపించుకోవాలని టీం చాలా కష్టపడి పనిచేస్తుంది.

సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటినా ఇంకా ప్రెస్ మీట్ లు వంటివి నిర్వహించి ఈ మూవీ ‘హిట్.. హిట్ అని చెప్పించాలని ప్రయత్నం చేస్తుంది’. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఒరిజినల్ లో హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉంటుంది.హీరోతో ఆ పాత్రకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా ఉండవు. అయితే ఆ పాత్ర ద్వారా ఒరిజినల్ లో హీరోకి ఓ మాస్ ఎలివేషన్ ఉంటుంది. ‘గాడ్ ఫాదర్’ లో అది మిస్ అయ్యింది.

ఈ పాత్ర ఎందుకు తీసేసారు అని దర్శకుడిని ప్రశ్నించగా.. ‘ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర 54 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ లో టోవినో థామస్ పాత్ర కొంచెం హీరో స్పేస్ ని ఆకుపై చేసినట్లు ఉంటుంది. అందుకే ఆ పాత్రని తీసేసి చెల్లెలి పాత్రకి అన్నయ్య పాత్రని కనెక్ట్ చేసి చిరంజీవి గారి స్క్రీన్ స్పేస్ పెంచాము. ఒరిజినల్ లో మోహన్ లాల్ 54 నిమిషాలు ఉంటారు. ఇక్కడ 2 గంటల పైగా నిడివి వచ్చేలా చేశాం ‘ అంటూ దర్శకుడు మోహన్ రాజా చెప్పుకొచ్చారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus