“నచ్చావులే” చిత్రంతో కథానాయకుడిగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ తనీష్ అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ మంచి పేరు దక్కించుకొన్నాడు. అయితే తర్వాత కాలంలో కొన్ని దురలవాట్లకు బానిసగా మారి సినిమా చాన్స్ లో చేజేతులా పోగొట్టుకొన్నాడు. తనీష్ హీరోగా నటించిన నాలుగైదు సినిమాలు ల్యాబుల్లోనే పడి ఉండగా.. మొదలైన సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.
అసలే కెరీర్ సరిగా లేక బాధపడుతున్న తనీష్ కు మరో దెబ్బ తగిలింది. చిన్నప్పట్నుంచి తనను నటుడిగా ఎంకరేజ్ చేస్తూ.. హీరోగా తన ఎదుగుడులకు పరోక్షంగా కారకుడైన తన తండ్రిని పోగొట్టుకొన్నాడు. నిన్న రాత్రి వారు నివాసముంటున్న ఎపార్ట్ మెంట్ ఆరో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. ఆసుపత్రిటి తీసుకువెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు.
ఈ హటాత్పరిణాంతో తనీష్ కుటుంబం ఒక్కసారిగా తీవ్రమైన షాక్ కు గురైంది. అయితే.. తనీష్ మందుకు అలవాటుపడి బోలెడు అప్పులు చేసాడని, సినిమాలు లేక అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడని, సడన్ గా అప్పులవాళ్లందరూ ఒకేసారి తమ డబ్బును తిరిగి ఇవ్వమని అడగడంతో.. మస్తాపానికి గురయిన తనీష్ తండ్రి ఆత్యహత్య చేసుకొన్నారనే గుసగుసలు కూడా వనవస్తున్నాయి. మరి ఆ గుసగుసలలో నిజం ఎంతో తెలియదు కానీ.. “ఫిల్మీ ఫోకస్” టీమ్ తనీష్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తోంది!