Rajamouli, Trivikram: రాజమౌళి కారణంగా కన్ఫ్యూజన్ లో త్రివిక్రమ్?

దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు ఫిట్నెస్ పరంగా కూడా మార్పులు చేసే చాన్స్ ఉందట. ఇప్పటివరకు మహేష్ బాబు ఎవరూ చూపించని విధంగా రాజమౌళి తనదైన శైలిలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెడతాడు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు.

ఇక రాజమౌళి కారణంగా మరోవైపు త్రివిక్రమ్ కూడా కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ తో కూడా త్రివిక్రమ్ ఇప్పటికీ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేయించాడు.

అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరపైకి రాబోయే సినిమా షెడ్యూల్ ఈ విషయంలో రాజమౌళి నిర్ణయం చాలా ఆధారపడి ఉందట. రాజమౌళి సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇక రాజమౌళి ఫైనల్ గా సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చెబితే దాన్ని బట్టి త్రివిక్రమ్ మహేష్ బాబుకు సంబంధించిన సినిమాను పనులను మొదలు పెట్టాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం నటీనటుల డేట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రాజెక్ట్ ఓకే అయితే వెంటనే అనుకున్న సమయానికి ఫినిష్ చేయాలని చూస్తున్నారు. తేడా వస్తే మళ్ళీ బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. ఇక రాజమౌళి ఎదో ఒకటి చెబితే త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ లేకుండా మహేష్ ప్రాజెక్ట్ ను ప్లానింగ్ తో ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus