ఈ ఏడాది మే 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆచార్య మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీకి ఆచార్య మూవీని వాయిదా వేయడానికి గల కారణాలు ఏమిటనే ప్రశ్న మెగాభిమానులను వెంటాడుతోంది. మొదట కొరటాల శివ డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినట్టు వార్తలు వచ్చాయి.
అయితే రిలీజ్ డేట్ మారడానికి పరోక్షంగా హీరో రామ్ చరణ్ కారణమని సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుండగా మూడు వారాల గ్యాప్ లో చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం మంచిది కాదని ఆచార్య డిస్ట్రిబ్యూటర్లు భావించారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి, కొరటాల శివ ఆర్ఆర్ఆర్ విడుదలైన నాలుగు వారాల తర్వాత ఆచార్య రిలీజయ్యేలా రిలీజ్ డేట్ ను మార్చారు.
ఆర్ఆర్ఆర్ రిలీజైతే చరణ్ కు క్రేజ్ పెరిగి ఆచార్య సినిమాకు ప్లస్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ లెక్కలను మార్చడంతో పాటు ఆచార్య రిలీజయ్యే సమయానికి ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు