Dulquer, Mrunal: సీతారామం సినిమాలు ఫేవరెట్ నా సాంగ్ అదే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఏవైటెడ్ చిత్రాలలో సీతారామం ఒకటి.అందమైన ప్రేమ కథ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇందులో నటీనటుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా ట్రైలర్, గ్లింప్ కి వస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు అంటూ తాను ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామం అనే సినిమా ఒక ఒరిజినల్ కథ, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి అంటూ సినిమా గురించి కామెంట్ చేశారు. ఇక అద్భుతమైన కథను అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి, అలాగే అశ్విని దత్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇక ఈ సినిమాలో కానున్న కళ్యాణం అనే పాటను కాశ్మీర్లో చిత్రీకరించారని, ఈ పాట తన ఫేవరెట్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో తాను రామ్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించగా నటి మృణాల్ సీత పాత్రలో నటించిందని తెలిపారు. ఇక ఈ సినిమా కథ విన్నప్పుడు సీత పాత్రను తాను ఊహించుకున్నానని అయితే ఈ సినిమా సెట్ లోకి నటి మృణాల్ అడుగుపెట్టగానే సీత పాత్రకు సరైన నటి దొరికింది అనే భావన కలిగిందని తెలిపారు.

తాను తప్ప ఈ పాత్రకు మరెవరు న్యాయం చేయలేదనిపించిందని ఈ సందర్భంగా నటుడు దుల్కర్ సల్మాన్ సీత పాత్ర గురించి తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో మీరందరూ ఓ కొత్త రష్మికను చూస్తారు అంటూ తెలిపారు. ఇందులో సుమంత్, తరుణ్ భాస్కర్, రష్మిక, గౌతమ్ మీనన్ వంటి నటీనటులు సందడి చేయనున్నట్లు వెల్లడించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus