Dulquer Salmaan: మలయాళం మార్కెట్ కోసం దుల్కర్ ను తీసుకున్నారా?

ప్రాజెక్ట్ కె గురించి మొదటి నుండి ఏ రూమర్ వచ్చినా అది నిజమైపోయింది. వాస్తవానికి ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో మూవీ అని అలా టాక్ వచ్చిందో లేదో ఇలా నిజమైపోయింది. ఆ తర్వాత అమితాబ్, దీపికా పదుకొనె వంటి వారు నటిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. అది కూడా నిజమైపోయింది. అలాగే కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అది కూడా నిజమైపోయింది.

ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ మొదలైంది. అందుకు కారణం కూడా ఉంది. అతని లేటెస్ట్ మూవీ `కింగ్ ఆఫ్ కోత‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఉన్న జె.ఆర్.సి లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా.. దుల్కర్ ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగింది హోస్ట్ సుమ.ఈ క్రమంలో ‘ప్రాజెక్ట్ కె’ లో మీరు నటిస్తున్నారా?’ అని సుమ… దుల్కర్ ను (Dulquer Salmaan) అడిగింది.అందుకు అతను ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పాడు.

‘ఈ విష‌యం గురించి నేను నేరుగా చెప్పకూడదు. టీం చెప్పాలి. ‘కానీ కచ్చితంగా.. ప్రాజెక్ట్ కె వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. అలాంటి గొప్ప ఐడియా.. నాగ అశ్విన్ కి త‌ప్ప మ‌రెవ్వ‌రికీ సాధ్యం కాదు’ అంటూ చెప్పాడు. దుల్కర్ ఆన్సర్ ను కరెక్ట్ గా గమనిస్తే చాలా డెప్త్ ఉంది. మలయాళం మార్కెట్ కి అతన్ని ఎంపిక చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. మరి చూడాలి..!

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus