Dulquer Salmaan: నా సినిమాలు నాకే సంతృప్తి ఇవ్వలేదు!

ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు దుల్కర్ సల్మాన్. నటుడిగా మలయాళ ఇండస్ట్రీలో ఎంతో మంచిసక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇక తెలుగులో మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ అనంతరం సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో అభిమానులు పెరగడమే కాకుండా తెలుగులో కూడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇకపోతే ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. తాజాగా దుల్కర్ నటించినటువంటి గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈయన పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..ఇండస్ట్రీలో నాకు ఎంతో ఇష్టమైనటువంటి నటీనటులు ఉన్నారు

అయితే ఏదైనా సినిమా చూస్తున్న సమయంలో ఈ సినిమాలో ఈయన కాకుండా నాకు నచ్చిన నటుడు కనుక నటించి ఉంటే సినిమా బాగుండదని అనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా నాలాగే ఆలోచిస్తారు అనేది నా అభిప్రాయం. ఇక సినిమాలలోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. ఇండస్ట్రీ లోకి వస్తే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా స్క్రీన్ పై నన్ను చూడటానికి ఇష్టపడతారా అని ఎన్నో సందేహాలు ఉండేవని ఈయన తెలియజేశారు.ఇలాంటి ఆలోచనల కారణంగానే తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఒకానొక సమయంలో భయపడ్డానని తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారి నటనలో మార్పు అనేది ఎంతో అవసరం.అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారిని నటనపరంగా చూసుకుంటే ఎన్నో మార్పులు కనిపిస్తాయని తెలిపారు తాను కెరియర్ మొదట్లో నటించిన సినిమాలను ఇప్పుడు కనుక చూస్తే నాకే సంతృప్తి ఉండదని ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేది అనిపిస్తుందని,నాన్న సినిమాలను చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా దుల్కర్ (Dulquer Salmaan) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus