బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!
- December 12, 2018 / 10:30 AM ISTByFilmy Focus
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది జాన్వీ కపూర్. ఆమె నటించిన మొదటి చిత్రం ‘దఢక్’. ఈ చిత్రం పెద్ద విజయం నమోదు చేయనప్పటికీ జాన్వీకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజా సమాచారం ప్రకారం జాన్వీ.. తొలి మహిళ ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రంలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా జాన్వి.. గుంజన్‌ను కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో జాన్వీకి జోడిగా నటించబోతున్నాడట. గతంలో ‘కార్వాన్’ ‘ది జోయా ఫాక్టర్’ వంటి రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించగా… ఇది తనకు మూడవ చిత్రం కావడం విశేషం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















