Dhurandhar: బాలీవుడ్‌కి మళ్లీ ఊపిరి ఇచ్చిన సినిమా… ఇప్పుడు తెలుగులోకి కూడా.. వాళ్లే రిలీజ్‌..

బాలీవుడ్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అనేలా తయారైంది. ఒక మంచి సినిమా తీసి, థియేటర్లలో విడుదల చేసి, భారీ వసూళ్లు అందుకుని.. బాలీవుడ్‌ తిరిగి ట్రాక్‌ ఎక్కేసినట్లే అని అనుకుంటుండగా.. ‘లేదు లేదు బాలీవుడ్‌ అలానే ఉంది’ అని చెప్పేలా ఓ డిజాస్టర్‌ వచ్చేస్తోంది. దీంతో తరచూ ‘బాలీవుడ్‌కి మళ్లీ ఊపిరి వచ్చింది’ అనే డైలాగ్‌ వినిపిస్తోంది. తాజాగా ఈ డైలాగ్‌ చెప్పే అవకాశం ఇచ్చిన సినిమా ‘దురంధర్‌’. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది.

Dhurandhar

రణ్‌వీర్‌ సింగ్‌కి మంచి హిట్‌ పడితే బాగుండు అని బాలీవుడ్‌ చాలా ఏళ్లుగా వెయిట్‌ చేస్తోంది. ఆ కోరికను నెరవేరుస్తూ దర్శకుడు ఆదిత్య ధర్‌ ‘ధురంధర్‌’ సినిమాను చేశాడు. సినిమాకు ఇటు పేరు, అటు వసూళ్లను అందుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా హవా సౌత్‌లో కూడా చాటడానికి సిద్ధమవుతోంది అని సమాచారం. అవును ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ను సిద్ధం చేస్తోందట. తెలుగులో ఓ పెద్ద నిర్మాణ సంస్థ / పంపిణీ సంస్థ ఈ సినిమాను రిలీజ్‌ చేయనుందని టాక్‌.

డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.500 కోట్ల వసూళ్ల దాటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ దారిలో నడుస్తోంది. ఈ జోరును ఇంకా కొనసాగించాలని టీమ్‌ ప్లాన్‌ చేసుకుంది. దానికితోడు సినిమా కథ పాన్‌ ఇండియా వైబ్‌ ఉన్నది కావడంతో సౌత్‌లో తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అంతేకాదు దీనికి డిసెంబరు 19 లేదంటే 24 డేట్‌ అని కూడా అనుకున్నారట.

ఈ సినిమా కోసం తెలుగులో ఇటు గీతా ఆర్ట్స్‌, అటు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పోటీ పడుతున్నాయని చెబుతున్నారు. ఎక్కువ ఛాన్స్‌లు అల్లు శిరీష్‌ రూపంలో గీతా ఆర్ట్స్‌కి ఉన్నాయని భోగట్టా.

సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus