OG Movie: మాట మార్చని నిర్మాత… ఆ రోజు కచ్చితంగా వస్తామంటున్న దానయ్య!

‘ఓజీ’ (OG) సినిమా రిలీజ్ డేట ఈ మధ్య అనౌన్స్‌ చేసినప్పుడు… ఏంటిది నిర్మాత దానయ్యకు (DVV Danayya) ఎందుకంత నమ్మకం, సినిమా వచ్చేస్తుందా? ఎలా వచ్చేస్తుంది? అంటూ రకరకాల ప్రశ్నలు వినిపించాయి. ఆ మాటకొస్తే ఇంకా వినిపిస్తున్నాయి కూడా. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబరు 27న రావడం కష్టం అంటూ తీర్మానించేసినవాళ్లూ ఉన్నారు. అదేదో మిగిలిన అందరు స్టార్‌ హీరోల సినిమాలు అనుకున్నట్లుగా వచ్చేసినట్లు… అంటూ అభిమానులు ఈ విషయంలో కాస్త సన్నాయి నొక్కులు కూడా నొక్కారు. అయితే ఇప్పుడు నిర్మాత దానయ్య మాత్రం మాట మార్చేది లేదు అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఎలా కాదన్నా జూన్‌ వరకు ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే జూన్‌తోనే ఎన్నికల వేడి ఆగిపోతుంది. అదే ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తే మాత్రం జులై అవుతుంది. దీంతో ఆగస్టు ఒక్క నెలలో ‘ఓజీ’ షూటింగ్ చేసి 25 రోజుల ప్రచారంతో సినిమా తెచ్చేస్తారా అనే డౌట్‌ కొంతమందిలో ఉంది. అనుకున్నట్లుగా ఆ మాట ఆ నోట ఈ నోట పడి అలా అలా టీమ్‌ వరకు వెళ్తలిందట. దీంతో దానయ్య స్పందించారు.

అంజలి (Anjali) నటించిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన దానయ్య… ‘ఓజీ’ రిలీజ్‌ డేట్‌ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము ఇదివరకు ప్రకటించిన విధంగానే సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పవన్‌  (Pawan Kalyan) రాజకీయ పరంగా బిజీగా ఉన్నారని, ఆ పనులు పూర్తి అయిన వెంటనే ‘ఓజీ’ కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది అంటున్నారు. అంటే పవన్‌ రాజకీయ పడవ దిగి… సినిమాల పడవ వెంటనే ఎక్కేస్తారు అన్నమాట.

దానయ్య మాటలు వింటుంటే పవన్‌ ఫ్యాన్స్‌కి అయితే భలే ఆనందంగా ఉంటుంది. ఇది నిజంగానే జరిగితే ఎంత బాగుంటుందో. పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ (Sujeeth) దర్శకుడు. పాన్ ఇండియన్ రేంజిలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi ) విలన్‌గా నటిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus